భద్రాద్రిలో పొంగిపొర్లుతున్న వాగు: జలదిగ్బంధంలో ప్రధాన రహదారి

0చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట–ఖమ్మం ప్రధాన హైవేపై మంథలపల్లి వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుధవారం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు రహదారిపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారి చెరువును తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ప్రవాహాన్ని అంచనా వేయకుండా రహదారిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని పర్యవేక్షించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్