పేకాట స్థావరంపై పోలీసుల దాడి ముగ్గురు అరెస్ట్

0చూసినవారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి ముగ్గురు అరెస్ట్
అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామ శివారులో గురువారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎస్సై యయాతి రాజు, సిబ్బంది మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు మోటార్ సైకిళ్ళు, నగదు 5,500/- స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కోడిపందాలు వంటి జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదం సమాచారాన్ని dial 100 కి కాల్ చేసి అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్