భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జామెందర్ పంచాయతీ పరిధిలో సుమారు మూడు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు చీకట్లో అవస్థలు పడుతున్నారని
బీజేపీ నాయకురాలు కారం రత్నకుమారి తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో చీకట్లో పురుగులు, విషజంతువుల సంచారం ఉండే అవకాశం ఉందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని
బీజేపీ తరఫున ఆమె కోరారు.