అశ్వారావుపేటలోని దమ్మపేట గ్రామంలోని బంజారా కాలనీలో మట్టి గణేష్ మండపం వద్ద ఆదివారం గణపతి పూజ, మహా హోమం నిర్వహించారు. కామవరపు విజయ మారుతి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, అనిత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలంటే మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిర్వాహకులు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే ప్రోత్సహించాలని కోరారు.