ములుకలపల్లి మండలంలోని పాల్వంచ–దమ్మపేట ప్రధాన రహదారిపై రాజుపేట వద్ద సైడ్ డైవర్షన్ భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీనివల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దమ్మపేట నుండి భద్రాచలం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలైన తిమ్మంపేట, వెంకటాపురం మీదుగా వెళ్లాలని సూచించారు. రహదారి పరిస్థితిని గమనించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు.