దమ్మపేట మండలంలో మంగళవారం కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు వారపు సంత వెలవెలబోయింది. తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో సంతకు కొనుగోలుదారులు, ప్రజలు ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో వ్యాపారాలు పూర్తిగా మందగించి, కొనుగోళ్లు లేక వ్యాపారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి సరుకులు తీసుకొచ్చి దుకాణాలు ఏర్పాటు చేసినప్పటికీ, వర్షం కారణంగా జనసంచారం లేక బేరాలు సాగలేదు. పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. వారపు సంతపై వర్షం ప్రభావం చూపడంతో వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.