రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ పోటీలకు విద్యార్థిని ఎంపిక

3చూసినవారు
రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ పోటీలకు విద్యార్థిని ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని తిలోచన, రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ పోటీలకు బుధవారం ఎంపికైంది. భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్‌-17 బాలికల విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచింది. గ్రామీణ, గిరిజన విద్యార్థుల్లోనూ ప్రతిభ ఉందని ఆమె విజయం నిరూపిస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం శారద, డిప్యూటీ వార్డెన్ నాగమణి, పీఈటీ వెంకన్నలు విద్యార్థినిని అభినందించారు.

సంబంధిత పోస్ట్