భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో తుఫాన్, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, పత్తి పంటలు, మామిడి, జీడిమామిడి, ఆయిల్‌పామ్ తోటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు గుమ్మడి నరసయ్య శనివారం డిమాండ్ చేశారు. పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.