అశ్వారావుపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధి గుర్వాయిగూడెంలో అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులతో టర్నడో బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో మామిడి, జీడి, పామాయిల్, పత్తి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగి, కొమ్మలు విరిగిపడ్డాయి. పంట చేతికొచ్చే సమయంలో జరిగిన ఈ నష్టంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి, నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.