యూటీయం ఫౌండేషన్: ఛత్తీస్‌గఢ్‌లోనూ రెండు హ్యాండ్ బోర్ల ఏర్పాటు

2197చూసినవారు
యూటీయం ఫౌండేషన్: ఛత్తీస్‌గఢ్‌లోనూ రెండు హ్యాండ్ బోర్ల ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన యూటీయం ఫౌండేషన్ డైరెక్టర్ పాయం స్టీవెన్ దొర, సోమవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంట మండల కేంద్రంలో కట్టంగూడ, బొడ్డిగూడ గ్రామాల్లో నూతనంగా రెండు హ్యాండ్ బోర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు లక్షా యాభై వేల రూపాయల ఖర్చుతో ఈ బోర్లను నిర్మించినట్లు, నిరుపేదలకు సేవ చేయడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్