భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులకు దమ్మపేట మండలం పట్వారిగూడెంలోని చెలికాని ఆదెమ్మ ఫంక్షన్ హాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్యఅతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి ప్రజలకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేలా బాధ్యతగా పనిచేయాలని కోరారు.