భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లోని ప్రైమ్ కేర్ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన శిరీష కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే గతంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి కుటుంబానికి సొంత నివాసం అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.