భద్రాచలం: ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా దక్షిణ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కాగా, మరి కొంతమంది బలగాలు జరిపిన కాల్పుల్లో గాయపడటంతో అడవులను జల్లెడ పడుతున్నారు. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.