భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం జరగనున్న శ్రీరామ క్రతువు కోసం దమ్మపేట శ్రీరామ భక్తబృందం 8,16,000 గోటి తలంబ్రాలను సమర్పించనుంది. గత పదేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ముక్కోటి ఏకాదశి నుంచి మహిళలు స్వయంగా ఒలిచి సిద్ధం చేసిన ఈ తలంబ్రాలను ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పంపనున్నారు.