
పారిస్లో రాజమౌళికి అరుదైన గౌరవం
గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఫ్రాన్స్ రాజధాని పారిస్లో అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర సంస్థల్లో ఒకటిగా పేరొందిన 'సినిమేటెక్ ఫ్రాన్సైస్' రాజమౌళికి శాశ్వత స్థానాన్ని కల్పించింది. భారతీయ సినిమా ఎదుగుదలను కొనియాడుతూ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత, గ్రీక్-ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ కూడా పాల్గొన్నారు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళికి ఈ గౌరవం దక్కింది.




