భద్రాచలంలోని కూనవరం రోడ్లో వాహన తనిఖీలు చేసిన ఖమ్మం ఆబ్కారీ ఎన్ఫోర్సుమెంట్ పోలీసులు 9. 30 కిలోల గంజాయిని మంగళవారం పట్టుకున్నారు. ఒడిశా సరిహద్దుల నుంచి భద్రాచలం మీదుగా ఏపీలోని విజయవాడ, ప్రకాశం జిల్లాలకు గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.