భద్రాచలం పుణ్యక్షేత్రంలో జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి సందర్భంగా ఆదివారం సాయంత్రం గోదావరి మాతకు వైభవంగా నదీహారతి నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన అనంతరం వరుణుడి ముత్యాల జల్లుల మధ్య ఈ వేడుక జరిగింది. నది హారతిని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.