భద్రాచలం ఏజెన్సీలో విద్యా, వైద్య రంగాల్లో వసుధ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అమోఘమని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. క్యాన్సర్, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు ఆర్థిక సహాయాన్ని ఆయన చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద వర్గాలకు విద్యా, వైద్య రంగాల్లో సేవలు చేయడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో సేవలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.