భద్రాచలం: గోదావరి నదిలో సుదర్శన చక్రానికి చక్రతీర్థం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శనివారంతో వసంతపక్ష శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. ఆదివారం నుంచి భద్రాద్రిలో సీతారాముల నిత్య కళ్యాణాలు పునః ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం పవిత్ర గోదావరి నదిలో నిర్వహించిన సుదర్శన చక్రానికి చక్ర తీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు.
