భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం JFCM కోర్టు బుధవారం చోరీ, చెక్‌బౌన్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు విధించింది. సారపాకలో గతేడాది రెండు ఇళ్లలో చోరీ చేసిన భూపాలపల్లి జిల్లా వాసి షేక్ దారుక్‌బాబుకు రెండు కేసుల్లోనూ ఒక్కో ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 1,000 చొప్పున జరిమానా విధించింది. మరో చెక్‌బౌన్స్ కేసులో గడ్డం నాగేశ్వరరావుకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఫిర్యాదిదారునికి రూ. 2.50 లక్షలు చెల్లించాలని మెజిస్ట్రేట్ వి. శివనాయక్ ఆదేశించారు.