భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన హైదరాబాద్‌కు చెందిన ఉదయ్ అనే యువకుడిని డీడీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక ఈతగాళ్లు సకాలంలో స్పందించి రక్షించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో, బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆపదలో ఉన్నవారిని కాపాడిన సిబ్బందికి, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు.