ఏటూరునాగారం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 7న ప్రారంభమైన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. వాలీబాల్ అండర్-17 బాలుర విభాగంలో ఒక జట్టు విజేతగా నిలిచింది. అండర్-14 బాలుర విభాగంలో ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో భద్రాచలం జట్టు ప్రథమ స్థానం సాధించాయి. కబడ్డీ అండర్-17 బాలురు, బాలికల విభాగాల్లో భద్రాచలం జట్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.