విద్యార్థుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ పీఎన్ఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో ఏటీడీవోలు, పీజీహెచ్ఎంలు కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ లకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిత్యం కంప్యూటర్ పై శిక్షణ ఇవ్వాలని సూచించారు.