పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం బస్టాండ్లో సోమవారం ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రైవేటు విద్యా సంస్థలు ఇచ్చే ఎలక్ట్రోరల్ బాండ్స్కు అలవాటు పడ్డాయని, అందుకనే ఫీజు నియంత్రణ చట్టం చేయడం లేదని విమర్శించారు.