భద్రాచలం: రేవంత్రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించవు

818చూసినవారు
భద్రాచలం: రేవంత్రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించవు
ఏపీ సీఎం మాటలు విని, తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు కోల్పోయేలా చేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. భద్రాచలంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఇలా జరిగితే భవిష్యత్ తరాలు రేవంత్ రెడ్డిని క్షమించబోరని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి రైతులకు అంకితం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్