ఆడబిడ్డల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు.
అర్హులైన 16 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను గురువారం భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.