శుక్రవారం నాడు హౌసింగ్ బోర్డ్ ఎండి వి. పి. గౌతమ్ భద్రాచల రామయ్యను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘన స్వాగతం పలికి, గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, రామయ్య ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.