భద్రాచలం: రామయ్య సన్నిధిలో హుండీ లెక్కింపు మొదలు

12చూసినవారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆలయ ఈఓ దామోదర్ రావు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, భక్తులు కలిసి వివిధ హుండీలలోని కానుకలను లెక్కించారు. ఈ లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. లెక్కించిన నగదు, బంగారం, వెండి వంటి కానుకల పూర్తి వివరాలు సాయంత్రానికి వెల్లడిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :