శుక్రవారం రామయ్య సన్నిధిలో శని, ఆదివారాల్లో జరిగే సహస్రకలశాభిషేక ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. పవిత్ర గోదావరి నుంచి మేళతాళాలతో గోదావరి జలాలను కలశబిందెతో తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా సహస్రకలశావాహనం, ఉత్సవమూర్తులకు అభిషేకం జరగనుంది.