భద్రాచలం రైతువేదికలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవంలో బుధవారం పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ముఖ్యంగా ఆయిల్పామ్ సాగు ద్వారా ఉత్తమ ఆదాయం పొందవచ్చని సూచించారు. అధికారుల సూచనలు పాటిస్తే రైతులు ఆర్థికంగా ఎదగవచ్చని ఆయన అన్నారు.