భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నయనానందకరంగా సాగింది. ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. బేడా మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం తర్వాత స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు.