భద్రాచలం పట్టణానికి చెందిన గురజాపు రవి, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసిన నేరానికి గాను మంగళవారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వి. శివనాయక్ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వైఎస్ఆర్నగర్కు చెందిన టీచర్ ముత్యాల కల్యాణ్బాబు ఫిర్యాదు మేరకు 2021లో భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.