శనివారం, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన కుటుంబంతో కలిసి భద్రాచలం రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికి, ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఎమ్మెల్యేకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట
కాంగ్రెస్ యువజన నాయకులు భజన ప్రసాద్, తదితరులు ఉన్నారు.