భద్రాచలం వద్ద నిర్మిస్తున్న కొత్త వంతెన అప్రోచ్ రోడ్డు మట్టి కుంగిపోవడంతో రాకపోకలు ఆదివారం నిలిచిపోయాయి. సారపాక వైపు పిల్లర్ల వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం ఆలస్యం కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో వాహనాలన్నీ పాత వంతెన మీదుగానే వెళ్లాల్సి వస్తోంది, ఫలితంగా ప్రతిరోజూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. వర్షాకాలం ప్రారంభమైనా పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.