భద్రాచలం ఐటీడీఏ పిఓ రాహుల్ గిరిజన యువతీ యువకులను కేవలం తమ గ్రామాలకే పరిమితం కాకుండా, బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఐటీడీఏ పరిధిలోని యువజన శిక్షణ కేంద్రంలో డేటా ఎంట్రీ, డ్రోన్ సర్వీస్, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయన సర్టిఫికెట్లు పంపిణీ చేసి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.