భద్రాచలం: నాణ్యమైన సరుకులు అందించాలి

1చూసినవారు
భద్రాచలం: నాణ్యమైన సరుకులు అందించాలి
భద్రగిరి మార్టులో వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన మార్ట్ను సందర్శించి స్టాక్, విక్రయాల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకులను ప్యాకింగ్ చేసి ఎంఆర్పీకే విక్రయించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. మార్టులో అందుబాటులో ఉన్న సరుకుల వివరాలను, వాటి నాణ్యతను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్