భద్రాచలం: బంగారు రూపంలో రామయ్య దర్శనం

0చూసినవారు
భద్రాచలం: బంగారు రూపంలో రామయ్య దర్శనం
భద్రాచలం శ్రీరామచంద్రుని సన్నిధిలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. దేవదేవుడు బంగారు కవచాలతో అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించి, క్షేత్ర విశిష్టతను వివరించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం చేశారు. సీతమ్మకు యోక్త్రధారణ, రామయ్యకు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ అలంకరణతో భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్