భద్రాచలం శ్రీరామయ్య సన్నిధిలో శుక్రవారం రాపత్తు ఉత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం 3 గంటలకు స్వామివారిని మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ వద్ద గల దసరా మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.