భద్రాచలంలో బుధవారం శ్రీరామచంద్రుని నిత్య కళ్యాణోత్సవం అర్చకులచే శాస్త్రోక్తంగా బేడా మండపంలో నిర్వహించబడింది. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిత్య కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది.