భద్రాచలం: పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వినతి

4చూసినవారు
భద్రాచలం: పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వినతి
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ. 8500 కోట్ల స్కాలర్షిప్, ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. పెండింగ్ ఫీజులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు.