భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కాలానివాసులు కోరారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. కాలనీలో వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని, 3 నెలలుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు. వర్షాకాలం దృష్ట్యా తక్షణమే శానిటైజేషన్ పనులు చేపట్టాలని కోరారు.