భద్రాచలం: రామయ్య సన్నిధిలో జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం

3చూసినవారు
భద్రాచల రామయ్య సన్నిధిలోని ఉపాలయాల్లో జీర్ణోద్ధరణ పనులను ఆదివారం చినజీయర్ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 మంది ఋత్వికులు 15 ఉపాలయాల్లోని 72 దేవతామూర్తులకు, మూడు రాజగోపురాలకు కళావాహన నిర్వహించారు. అనంతరం ఈ మూర్తులను బాలాలయానికి తరలించనున్నారు. ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు పూర్తయిన తర్వాతే విగ్రహాలను తిరిగి పునఃప్రతిష్ఠిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్