భద్రాచలం: సమ్మర్ క్యాంపులతో నైపుణ్యాల అభివృద్ధి

1చూసినవారు
భద్రాచలం: సమ్మర్ క్యాంపులతో నైపుణ్యాల అభివృద్ధి
భద్రాచలం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ మంగళవారం భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల, వికాసం పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ట్, క్రాఫ్ట్స్, నృత్యం, పాటలు, కంప్యూటర్ శిక్షణ తరగతులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న క్యాంపుల వలన విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ శిబిరాలు దోహదపడతాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్