భద్రాచలం: పదో ఫలితాల్లో గిరిజన విద్యార్థుల జోరు

0చూసినవారు
భద్రాచలం: పదో ఫలితాల్లో గిరిజన విద్యార్థుల జోరు
బుధవారం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి ఫలితాల్లో గిరిజన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. జిల్లాలో 90.88 శాతం, ఖమ్మం జిల్లాలో 94.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 2,226 మంది విద్యార్థులకు గాను 2,023 మంది ఉత్తీర్ణులయ్యారు. 22 ఆశ్రమ పాఠశాలలు, 5 వసతి గృహాల్లో వంద శాతం ఫలితాలు సాధించడం గమనార్హం. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పీఓ బి. రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్