భద్రాచలంలో పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన గడ్డం ఆకాష్(20) గురువారం ఉదయం తమ నివాసంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా ఓ ప్రైవేటు ల్యాబ్లో టెక్నీషియన్ గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.