భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్ల పర్యవేక్షణపై ఆర్అండ్బీ శాఖలో అధికారుల కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో 1,800 కి.మీ. రహదారులు ఉండగా, 30 ఏఈఈ పోస్టులకు ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఈఈ, డీఈ, ఏఈఈ పోస్టులు కలిపి 41 మందికి గాను కేవలం ఏడుగురే అందుబాటులో ఉన్నారు. దీంతో డీఈలపై అదనపు బాధ్యతలు పడుతున్నాయి. ఏఈఈల కొరత వాస్తవమేనని, కొత్త
నియామకాలు త్వరలో జరిగే అవకాశం ఉందని ఈఈ శంకర్రావు తెలిపారు.