వైభవంగా ప్రారంభమైన భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు

2చూసినవారు
వైభవంగా ప్రారంభమైన భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవ పనులు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రోలు, రోకలికి దేవతలం ఆవాహనం చేసి పూజలు చేశారు. అనంతరం వసంతోత్సవంతో పాటు ఆలయ అధికారులు, భక్తుల సమక్షంలో పసుపు కొమ్ములు దంచి తలంబ్రాలు కలిపారు. శ్రీరామనవమి కళ్యాణం, పట్టాభిషేకం వేడుకల కోసం మిథిలా మండపంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్ రావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్