భద్రాచలం: సారపాక–భద్రాచలం రెండో వంతెన అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సరైన హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు లేకపోవడంతో ఇటీవల ఒక వ్యక్తి ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. మరో ప్రమాదం జరగకముందే అధికారులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ సంఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.