చర్ల వ్యవసాయ శాఖ, సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరిగింది. ఆత్మ కమిటీ ఛైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న జీలుగా, పిల్లిపెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వానాకాలం సాగుకు ముందే రైతులు వీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో లావణ్య, ఏఈఓలు రామకృష్ణ, వినీల తదితరులు పాల్గొన్నారు.