చర్ల: 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన

3చూసినవారు
చర్ల మండలంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నూతన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. సుమారు 10 కోట్ల 70 లక్షల రూపాయల స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నిధులతో ఈ అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులను, సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్